మర్కజ్​ కేసులన్నీ ట్రేస్ చేశారా? సడలింపులిస్తే ప్రాబ్లమ్ ఏంటి?

మర్కజ్​ కేసులన్నీ ట్రేస్ చేశారా? సడలింపులిస్తే ప్రాబ్లమ్ ఏంటి?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మర్కజ్  రిలేటెడ్  కేసులన్నీ ట్రేస్  చేశారా? లాక్ డౌన్ సడలింపులు ఎలాంటి ప్రాంతాల్లో ఇవ్వొచ్చు? సడలింపులు ఇస్తే తలెత్తే సమస్యలు ఏమిటి? పోలీస్  బందోబస్తు ఎలా  కొనసాగుతోంది? తదితర వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి నుంచి ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా సోషల్ డిస్టెన్సీతోపాటు కంటెయిన్ మెంట్స్, కరోనా హాస్పిటల్స్, ఐసోలేషన్  సెంటర్స్ వద్ద డాక్టర్లు, సిబ్బంది, సెక్యూరిటీపై ఆరా తీసింది. కరోనా తీవ్రత, లాక్ డౌన్ అమలుపై రాష్ట్రంలో పర్యటిస్తున్న జలశక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోకా, పబ్లిక్  హెల్త్  సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, జాతీయ కన్జ్యూమర్  అఫైర్స్  డైరెక్టర్  ఎస్. ఎస్. ఠాకూర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేదితో కూడిన సెంట్రల్  టీమ్  ఆదివారం డీజీపీ మహేందర్ రెడ్డితో సమావేశమైంది. లాక్ డౌన్ తోపాటు మర్కజ్ నుంచి వచ్చిన వారిని ట్రేస్ చేసిన వివరాలు, వారి కాంటాక్ట్స్ వల్ల తలెత్తిన పాజిటివ్  కేసులను టీమ్  రికార్డ్ చేసింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్ మెంట్ చేపడుతున్న బందోబస్తు బాగుందని అభినందించింది. రూల్స్  పాటించని వారిపై నమోదైన కేసుల డేటాను కలెక్ట్ చేసింది. వలస కార్మికులు రాష్ట్రాన్ని విడిచి వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకుంది. లాక్ డౌన్ ఎత్తివేస్తే సోషల్ డిస్టెన్సీకి సమస్య కలిగే అవకాశాలు ఉంటే మళ్లీ కొనసాగించాల్సి వస్తుందా అని కూడా అడిగినట్లు సమాచారం.

డీజీపీ పవర్  పాయింట్  ప్రజంటేషన్

అడిషనల్ డీజీలు జితేందర్,  గోవింద్ సింగ్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సీపీలు అంజనీ కుమార్, మహేష్  భగవత్, వి.సి. సజ్జనార్ తో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి సెంట్రల్  టీమ్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కరోనా కట్టడి కోసం హెల్త్, మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖల కో ఆర్డినేషన్ తో చేపట్టిన చర్యలను వివరించారు. బందోబస్తుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యపరమైన సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా కిడ్నీ, డయాలసిస్, హార్ట్  పేషెంట్లకు, గర్భిణులకు ఎమర్జెన్సీ టైంలో డిపార్ట్ మెంట్ అందిస్తున్న సేవలను వివరించారు. కేవలం హైదరాబాద్ లోనే రూల్స్  పాటించని లక్షకుపైగా వెహికల్స్  సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

మార్కెట్లు, కంటెయిన్ మెంట్  జోన్ల పరిశీలన

హైదరాబాద్ లో లాక్ డౌన్  అమలవుతున్న తీరును సెంట్రల్  టీమ్  స్వయంగా పరిశీలించింది. మార్కెట్లు, కంటెయిన్ మెంట్  జోన్లలో పర్యటించి వివరాలు తెలుసుకుంది. టీమ్  వెంట రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు. మెహిదీప ‌‌ట్నం రైతు బ ‌‌జార్ ‌‌ను సంద ‌‌ర్శించి.. అక్కడ నిత్యావ ‌‌స ‌‌ర వ ‌‌స్తువుల ‌‌ను అమ్ముతున్న కిరాణాషాపుల య ‌‌జ ‌‌మానులతో టీమ్  మెంబర్స్  మాట్లాడారు. సోషల్  డిస్టెన్స్  కోసం ఏర్పాటుచేసిన బాక్సులను పరిశీలించారు. కూర ‌‌గాయ ‌‌లు, ఆకుకూరలు అమ్ముతున్న రైతుల ‌‌తోనూ మాట్లాడారు. రైతు బ ‌‌జార్ ‌‌కు కూర ‌‌గాయ ‌‌లు ఎలా తెస్తున్నార ‌‌ని , వాటిని తీసుకురావడానికి రవాణా సదుపాయం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అమీర్ ‌‌పేట్ ‌‌లోని నేచ ‌‌ర్ క్యూర్ హాస్పిట ‌‌ల్ ‌‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ ‌‌ను సెంట్రల్  టీమ్  త ‌‌నిఖీ చేసింది. అక్కడి డాక్టర్లు, స్టాఫ్ తో టీమ్  మెంబర్స్  మాట్లాడారు. అదేవిధంగా మ ‌‌ల ‌‌క్ ‌‌పేట్, మెట్టుగూడలోని కంటెయిన్ మెంట్ జోన్లను కూడా తనిఖీ చేశారు. కంటెయిన్ ‌‌మెంట్​లో ఎవ ‌‌రినీ బ ‌‌య ‌‌ట ‌‌కు అనుమ ‌‌తించ ‌‌డంలేద ‌‌ని, కావాల్సిన వ ‌‌స్తువుల ‌‌ను ప ‌‌క్కనే ఉన్న సూప ‌‌ర్ మార్కెట్ నుంచి తెచ్చి ఇస్తున్నట్టు అక్కడి అధికారులు సెంట్రల్  టీమ్ కు వివ ‌‌రించారు. ప్రతిరోజు ఇంటింటికీ తిరిగి ఫీవ ర్ స‌‌ర్వే చేస్తున్నట్టు చెప్పారు. తార్నాకలోని సీసీఎంబీని కూడా సెంట్రల్  టీమ్  సందర్శించింది.