సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి : డీఐజీ ఎల్ఎస్.చౌహన్

సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి : డీఐజీ ఎల్ఎస్.చౌహన్

పెబ్బేరు/పెద్దమందడి/చిన్నంబావి, వెలుగు: సైబర్ నేరాలపై గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని జోగులాంబ జోన్​ డీఐజీ ఎల్ఎస్.చౌహన్ చెప్పారు. సోమవారం వార్షిక తనిఖీల్లో భాగంగా వనపర్తి జిల్లాలోని పెబ్బేరు, చిన్నంబావి, పెద్దమందడి పోలీస్​స్టేషన్లను తనిఖీ చేశారు. ఆయనకు ఎస్పీ గిరిధర్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయా ఠాణాల్లో రికార్డులను పరిశీలించారు. 

అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఆర్థిక నేరాలను కట్టడి చేయడానికి ప్రజలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు బిగించుకునేలా చూడాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరావు, వనపర్తి, కొత్తకోట సీఐలు కృష్ణయ్య, రాంబాబు, ఎస్సైలు యుగంధర్ రెడ్డి, జగన్, శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.