2023–24 ఆర్థిక సంవత్సరం నిమిత్తం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. చిన్నారులు, యుక్త వయస్సు వారి కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం దీనిని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. భౌగోళిక, భాషాపరమైన, కళలపరంగా, అన్ని స్థాయుల్లో పుస్తకాలను ఇది అందుబాటులోకి ఉంచుతుంది. ‘యువత కోసం పంచాయతీ, వార్డు స్థాయుల్లో ఫిజికల్ లైబ్రరీలు ఏర్పాటుకు రాష్ట్రాలకు ప్రోత్సాహం అందిస్తాం. నేషనల్ డిజిటల్ లైబ్రరీ సదుపాయాన్ని పొందేందుకు కావాల్సిన మౌలిక వసతులకు తోడ్పాటు అందిస్తాం’ అని వెల్లడించారు.
రానున్న మూడు సంవత్సరాలకు 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల కోసం నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు. అందుకోసం 38,800 మంది టీచర్లు, సహాయక సిబ్బందిని తీసుకుంటామన్నారు. ఈ పాఠశాలల కింద 3.5 లక్షల గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
