బడ్జెట్ లో విద్యారంగానికే అధిక ప్రాధాన్యత

బడ్జెట్ లో విద్యారంగానికే అధిక ప్రాధాన్యత

యువతను శక్తివంతం చేస్తే.. దేశం కూడా శక్తివంతమవుతుందని ప్రధాని మోడీ చెప్పారు. ఎడ్యుకేషన్ సెక్టార్ పై వెబినార్ నిర్వహించారు ప్రధాని మోడీ. కేంద్ర బడ్జెట్ లో విద్యా రంగానికి సంబంధించి 5 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్ మెంట్ కు, పట్టణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని... జాతీయ విద్యావిధానం తీసుకొచ్చేందుకు ఈ బడ్జెట్ ఎంతో హెల్ప్ అవుతుందన్నారు. నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ అనేది గొప్ప స్టెప్ అని.. దీనివల్ల ఇకపై సీట్ల కొరతనేది ఉండదన్నారు. వీలైనంత త్వరగా.. డిజిటల్ యూనివర్సిటీ ప్రారంభమయ్యేలా చూడాలని స్టేక్ హోల్డర్స్ ను కోరారు పీఎం.

మరిన్ని వార్తల కోసం

'కళావతి’ పాటకు సితార స్టెప్పులు

రీల్ సీఎంగా యడ్యూరప్ప