
ఎంతోమంది నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్లను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన దిల్ రాజు.. మరో అడుగు ముందుకేసి ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే సంస్థను ప్రారంభించారు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఆయన ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగం కావాలనుకునే వారు ‘‘దిల్‌రాజు డ్రీమ్స్’’ అనే వెబ్ సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆయన టీమ్ వారిని సంప్రదిస్తుంది. జూన్‌లో ఇది ప్రారంభం కానుంది. ప్రతిభ ఉండి కూడా చిత్రపరిశ్రమలో పరిచయాలు లేక, ఎవరిని సంప్రదించాలో తెలియక ముందుకెళ్లలేకపోతున్న వాళ్లకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని దిల్‌రాజు తెలియజేశారు.