తెలంగాణ కల్చర్‌‌‌‌ను చూపించడంలో వేణు సక్సెస్ : దిల్ రాజు

తెలంగాణ కల్చర్‌‌‌‌ను చూపించడంలో వేణు  సక్సెస్ :  దిల్ రాజు

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రాజ్ జంటగా దిల్ రాజు ప్రొడక్షన్స్‌‌లో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’.  కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం మార్చి 3న విడుదలైంది. ఈ సినిమాకి లభిస్తున్న రెస్పాన్స్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ ‘విలేజ్ నుంచే వచ్చాను కనుక వేణు చెప్పిన కథకు ఎక్కువ కనెక్ట్ అయ్యాను. తెలంగాణ కల్చర్‌‌‌‌ను చూపించడంలో అతను సక్సెస్ అయ్యాడు. వేణులో మంచి దర్శకుడు ఉన్నాడని అర్ధమయింది. ఇక నిర్మాతలుగా హర్షిత్, హన్షితకు ఫస్ట్ మూవీ కాబట్టి.. అన్నీ దగ్గరుండి చూసుకున్నా. వాళ్లను కూడా అన్ని విషయాల్లో గైడ్ చేశాను. ఫస్ట్ ప్రాజెక్టుతో వచ్చిన అప్లాజ్,  రెవెన్యూతో వాళ్లు హ్యాపీ ఫీలవుతున్నారు. సినిమాకొచ్చిన రెస్పాన్స్‌‌తో వాళ్లకి ఎనర్జీ వచ్చింది. నాక్కూడా చిన్న సినిమా సక్సెస్ అయినప్పుడు వచ్చే కిక్కే వేరు. అనుకున్న బడ్జెట్ కంటే ఇరవై శాతం పెరిగింది. ఆ విషయం ముందే తెలిసినా, కావాలనే ఇంత టార్గెట్‌‌లోనే చేయాలని చెప్పా.  చిన్న సినిమా అని వదిలేయొద్దు.. ఇది గొప్ప సినిమా. ఎవరూ మిస్ అవ్వొద్దు. ఇందులో స్ట్రాంగ్ ఎమోషన్‌‌తో పాటు మంచి మెసేజ్ ఉంది.  మేం డబ్బు కోసం చేసిన సినిమా కాదు ఇది. ప్రేమతో తీసిన సినిమా’ అన్నారు.