
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఒఫ్ కామర్స్(TFCC elections 2023) ఎన్నికల హడావుడి నడుస్తోంది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పదవి కోసం జరుగుతున్న ఈ ఎలక్షన్స్ లో ప్రముఖ నిర్మాతలు సి కళ్యాణ్(C Kalyan), దిల్ రాజు(Dill Raju) పోటీ పడుతున్నారు. జులై 30 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి.
ఇందులో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత దిల్ రాజు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చే అవకాశం లేదు కానీ.. నేను రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీ నుండి పోటీ చేసినా ఎంపీగా గెలుస్తాను. కానీ ప్రస్తుతం నా ఇంట్రెస్ట్ అంతా సినీ రంగంపైనే అంటూ రాజకీయాలపై తన స్టాండ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ రెండు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఇక దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) తో గేమ్ ఛేంజర్(Game changer) సినిమా చేస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) ఈ సినిమాను తెరకెక్కిస్తాన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య రానున్న ఈ సినిమా వచ్చే ఎడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తోపాటు విజయ్ దేవరకొండ(Vijay devarakonda), పరశురామ్(Parasuram) కాంబోలో మరి మూవీని నిర్మిస్తానారు దిల్ రాజు. మృణాల్ ఠాకూర్(Mrunal Takhur) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ మధ్యే లాంఛనంగా ప్రారంభమైంది.