మరోసారి వివాదంలో డింపుల్ హయతి.. ఫిలింనగర్లో కేసు నమోదు

మరోసారి వివాదంలో డింపుల్ హయతి.. ఫిలింనగర్లో కేసు నమోదు

అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విషయంలో ఏకంగా డీసీపీతోనే గొడవపడి కేసులు ఎదుర్కొన్న హీరోయిన్ డింపుల్ హయతి.. మరో వివాదంలో చిక్కుకుంది. ఫిలింనగర్ లో కేసు నమోదు కావడంతో మరోసారి వార్తల్లోకెక్కింది. డింపుల్ హయతితో పాటు ఆమె భర్తపైన కూడా కేసు నమోదవ్వటంతో ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

ఒడిస్సా కు చెందిన పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంట్లో పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని పనిమనిషి  చేసిన  ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కుక్క అరిచిందని చెప్పి తనను నగ్నంగా చేసి కొట్టేందుకు ప్రయత్నించారని పనిమనిషి ఆరోపణ చేసింది. 

తన నగ్న వీడియోలు తీసేందుకు ప్రయత్నించారని పనిమనిషి సంచలన ఆరోపణ  చేసింది. ఇంట్లో పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా బయటికి పంపేశారని ఫిర్యాదులో పేర్కొంది. చిత్రహింసలు చేసిన హయతీతోపాటు భర్తపై కూడా ఫిర్యాదు చేసింది. 

డింపుల్ హయతీ 2017లో గల్ఫ్ సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. ఆతర్వాత  2019లో యురేక, గద్దలకొండ గణేష్ సినిమాల్లో నటించింది. ఇటీవల రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో మరోసారి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. చివరిగా రామబాణం అనే సినిమాలో కనిపించిన హయతీ.. శర్వానంద్ తో కలిసి నటిస్తోంది. బోగి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో డింపుల్ హీరోయిన్ గా ఎంపికైంది.