కుమ్రం భీం జిల్లా : కుమ్రం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్తులు మరోసారి దీక్షకు దిగారు. వాగుపై వంతెన, రోడ్డు నిర్మాణానికి అధికారులు సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పోశమ్మ ఆలయంలో కొబ్బరికాయ కొట్టి.. ప్లకార్డులతో వాగు వద్ద దీక్షకు దిగారు. గతేడాది బ్రిడ్జి నిర్మాణం కోసం నాలుగు రోజులు దీక్ష చేశారు. ఆ సమయంలో అధికారులు వచ్చి.. బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారు. దీంతో దిందా గ్రామస్తులు దీక్ష విరమించారు.
ఏడాది గడుస్తున్నా... అధికారులు ఇచ్చిన హామీని ఇంతవరకూ నెరవేర్చకపోవడంతో మరోసారి దీక్షకు దిగారు. గత రెండు రోజులుగా దిందా గ్రామం జల దిగ్భందంలోనే ఉండడంతో గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తమ సమస్యలను పరిష్కరించే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. రాత్రి సమయంలోనూ దిందా గ్రామస్తులు దీక్ష కొనసాగిస్తున్నారు.
కుమ్రం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్తులు మరోసారి దీక్షకు దిగారు. వాగుపై వంతెన, రోడ్డు నిర్మాణానికి అధికారులు సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పోశమ్మ ఆలయంలో కొబ్బరికాయ కొట్టి.. ప్లకార్డులతో వాగు వద్ద దీక్షకు దిగారు. గతేడాది బ్రిడ్జి నిర్మాణం కోసం నాలుగు రోజులు దీక్ష చేశారు. ఆ సమయంలో అధికారులు వచ్చి.. బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారు. దీంతో దిందా గ్రామస్తులు దీక్ష విరమించారు.
