కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ టీమిండియా మొదటి సారి తన టీమ్ మీద కోప్పడ్డాడు. మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అడుగుజాడల్లో నడిచే కార్తీక్.. శుక్రవారం కింగ్స్ లెవెన్ తో మ్యాచ్ సందర్భంగా తన సొంత జట్టుపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జట్టు సభ్యులందరిని పిలిచి వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్లుగా మాట్లాడాడు. ప్లేఆఫ్ బెర్త్ కోసం గెలుపు జరిగే ఆ కీలక మ్యాచ్ లో తన టీమ్ ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతాకు సందీప్ వారియర్ మంచి ఆరంభాన్నిచ్చాడు. మంచి ఫామ్ లో వున్న కెఎల్ రాహుల్, గేల్ వంటి విద్వంసకర ఓపెనర్లను తొందరగానే ఔట్ చేశాడు. అయితే ఆ తర్వాత కోల్ కతా ఫీల్డింగ్ తో బౌలింగ్ గాడి తప్పింది. సునీల్ నరైన్ రెండు సందర్భాల్లో మిస్ ఫీల్డ్ చేసాడు. అంతేకాకుండా దాటిగా ఆడుతున్న పంజాబ్ బ్యాట్ మెన్స్ ని కెకెఆర్ బౌలర్లు అడ్డుకోలేకపోయారు. దీంతో భావోద్వేగాన్ని అణచుకోలేకపోయిన కార్తిక్ దాన్ని బయటపెట్టుకున్నాడు.
ఈ మ్యాచ్ లో కేకేఆర్ 184 పరుగుల లక్ష్యాన్ని చేధించి పంజాబ్ పై విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత తన కోపం గురించి మాట్లాడుతూ.. ఈ విజయంపై తానంత సంతృప్తిగా లేనని అన్నాడు. ముఖ్యంగా తమ జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలు తనను నిరాశకు గురిచేశాయని అన్నాడు. ఒక కెప్టెన్‌గా తాను ఏమి ఆలోచిస్తున్నానో వాళ్లకు తెలియడం కోసమే కోపం ప్రదర్శించినట్టు కార్తీక్ తెలిపాడు
