ఏఐ టూల్స్ క్రియేట్ చేస్తున్న ఆందోళనల నుంచి అమెరికా ఇరాన్ మధ్య వార్ వరకూ ఉద్రిక్తతలు నెమ్మదించాయి. దీంతో బంగారం వెండి ధరల ర్యాలీకి బ్రేక్ వచ్చింది. స్వల్ప ఊగిసలాటలు ఉన్నప్పటికీ రేట్లలో పెద్దగా మార్పులు లేకపోవటంతో షాపింగ్ చేయాలని అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లో రేట్లను పరిశీలించటం ముఖ్యం.
ఫిబ్రవరి 25న బంగారం రేట్లు పెరిగి వినియోగదారులకు షాకిచ్చాయి. దీంతో ఫిబ్రవరి 24 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.11 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 189గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 840గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : ట్రంప్ సోలార్ షాక్
ఇక వెండి విషయానికి వస్తే ఫిబ్రవరి 25, 2025న రేటు కేజీకి రూ.5వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 95వేలకు చేరుకుంది. అంటే గ్రాము ధర రూ.295 వద్ద ఉంది.
