మెదక్టౌన్, వెలుగు: ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని ఎమ్మెల్యే రోహిత్ అన్నారు. మంగళవారం ఆయన మెదక్పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తూ, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో రుణమాఫీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఏవో దేవకుమార్, ఏడీ విజయ నిర్మల, తహసీల్దార్ సింధు రేణుక, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ నరేశ్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరుశరామ్, కాంగ్రెస్ నాయకులు అంజనేయులు, శంకర్, రవి, హఫీజ్, నాగిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.
