ఇకపై ఆర్ధిక నేరాల కేసుల దర్యాప్తు దినేశ్​పరుచూరి నేతృత్వంలో

ఇకపై ఆర్ధిక నేరాల కేసుల దర్యాప్తు దినేశ్​పరుచూరి నేతృత్వంలో

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హైదరాబాద్‌‌‌‌ జోన్ అదనపు డైరెక్టర్ గా ఐఆర్ఎస్ అధికారి దినేశ్​ పరుచూరి నియమితులయ్యారు. ఇక నుంచి తెలంగాణ, ఏపీల్లో  నమోదైన ఆర్ధిక నేరాల కేసుల దర్యాప్తు, దినేశ్​పరుచూరి నేతృత్వంలో జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉండడంతో కీలకమైన కేసుల్లో విచారణ వేగవంతం కానుంది. ఈ క్రమంలోనే చీకోటి ప్రవీణ్‌‌‌‌ కేసులో ఈడీ దూకుడు పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. 2009 ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌)బ్యాచ్‌‌‌‌కు చెందిన దినేశ్​ పరుచూరి గత నెల 31న డిప్యూటేషన్‌‌‌‌పై ఈడీలో చేరారు.

అంతకు ముందు ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ టాక్స్‌‌‌‌, ఏపీ ట్రాన్స్‌‌‌‌కో డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో  పనిచేశారు. ప్రస్తుతమున్న ఈడీ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ముంబై రెండో జోన్ కు బదిలీ అయ్యారు. హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా మూడేళ్లు పనిచేశారు. లోన్‌‌‌‌ యాప్స్,ఈఎస్‌‌‌‌ఐ ఐఎమ్‌‌‌‌ఎస్‌‌‌‌ స్కామ్‌‌‌‌, వంటి  కేసులను అభిషేక్ గోయల్ దర్యాప్తు చేశారు.