Madharaasi: ఓ కొత్త సమస్యపై ‘మదరాసి’ తీశా.. పక్కా తెలుసుకోవాల్సిన పాయింట్ అది: మురుగదాస్

Madharaasi: ఓ కొత్త సమస్యపై ‘మదరాసి’ తీశా.. పక్కా తెలుసుకోవాల్సిన పాయింట్ అది: మురుగదాస్

శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ తెరక్కించిన చిత్రం ‘మదరాసి’. రుక్మిణి వసంత్ హీరోయిన్. విద్యుత్ జమ్వాల్ విలన్‌‌గా నటించాడు. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించింది. శుక్రవారం సినిమా విడుదలవుతున్న క్రమంలో దర్శకుడు మురుగదాస్‌‌ చిత్ర విశేషాలను గురించి ఇలా వివరించారు.

ఉత్తరాది వాళ్లు మన దక్షిణాది వాళ్లందరినీ ‘మదరాసి’ అని పిలుస్తుంటారు. విలన్‌‌ పాయింట్‌‌ ఆఫ్‌‌ వ్యూలో నడిచే కథ ఇది. ఇందులో హీరోని విలన్‌ మదరాసి అని పిలుస్తుంటాడు. అందుకే ఈ టైటిల్ పెట్టాం. సబ్జెక్ట్ చాలా డిఫరెంట్‌‌గా, కొత్తగా ఉంటుంది. వెస్ట్రన్ కంట్రీస్‌‌లో ఇప్పటికే ఉండి, మన దేశంలోకి వస్తున్న ఓ కొత్త సమస్యను బేస్ చేసుకుని ఈ కథ రాసుకున్నా. అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ అది.

శివ కార్తికేయన్ లాంటి మాస్‌‌ ఇమేజ్‌‌ ఉన్న హీరోతో ఈ కథ చెప్తేనే ఎక్కువ రీచ్ అవుతుంది. తను కూడా వెంటనే ఓకే చెప్పాడు. కథ పరంగా హీరో పాత్ర చాలా డిఫరెంట్‌‌గా ఉంటుంది. ఇక రుక్మిణీ వసంత్ పాత్ర చాలా రియలిస్టిక్‌‌గా ఉంటుంది.

అలాగే ప్రస్తుతం హీరోగా చేస్తున్నప్పటికీ, ఇందులోని పాత్ర నచ్చడంతో విద్యుత్ జమ్వాల్‌‌ విలన్‌‌గా నటించడానికి ఒప్పుకున్నారు. నేను తీసిన సీన్లను నెక్స్ట్‌ లెవెల్‌‌కు తీసుకెళ్తూ, మంచి సినిమాటిక్ ఎక్స్‌‌పీరియెన్స్ ఇచ్చేలా అనిరుధ్ ఆర్ఆర్ ఇచ్చారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయి. సెకండాఫ్‌‌లో హీరో, విలన్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్‌‌ అబ్బురపరుస్తాయి. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందనే కాన్ఫిడెంట్‌‌తో ఉన్నాను’’.