
- నేటి నుంచి వైద్య శిబిరం
హైదరాబాద్, వెలుగు: నిమ్స్‌లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నట్లు డైరెక్టర్ బీరప్ప తెలిపారు. పుట్టుకతో గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు బ్రిటన్ వైద్య బృందం ఆపరేషన్లు చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం నుంచి ఈ నెల 21 వరకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. పేషెంట్లు వారి పాత రిపోర్టులను, సిటీ స్కాన్ రిపోర్ట్‌లను రిఫరెన్స్ కోసం వెంట తెచ్చుకోవాలన్నారు.
టెస్ట్‌లు చేశాక అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని వెల్లడించారు. పేషెంట్లు మంగళ, గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓల్డ్ బిల్డింగ్ సీటీవీఎస్ కార్యాలయంలో డాక్టర్ ఆమరేష్ రావు, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ గోపాల్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.