అఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి.. కాస్త టైం గ్యాప్ అంతే!

అఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి.. కాస్త టైం గ్యాప్ అంతే!

నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో అఖండ(Akhanda) ఒకటి. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో పాటు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. బోయపాటి – బాలయ్య కాంబోలో మూడో సినిమాగా వచ్చిన  అఖండ.. హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. 

తాజాగా ఇదే విషయం మరోసారి క్లారిటీ ఇచ్చారు బోయపాటి. ఆయన దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. ఉస్తాద్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో  లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela), సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పక్కా మాస్ అండ్  కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఆగస్టు 26 శనివారం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

దీంతో బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున ఈవెంట్ కు హాజరయ్యారు. ఈవెంట్ మొదలైనప్పటి నుండి ఆడియన్స్ అంతా అఖండ 2.. అఖండ 2.. అంటూ అరవడం మొదలుపెట్టారు. ఇక బోయపాటి మాట్లాడుతున్నపుడు కూడా అలాగే అరిచారు. దానికి సమాధానంగా బోయపాటి స్పందిస్తూ.. అఖండ 2 కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. కాస్త సమయం అంటూ ఇటు అవ్వొచ్చు కానీ.. సినిమా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులంతా ఒక్కసారిగా జై బాలయ్య అంటూ అరవడం మొదలుపెట్టారు. అంతేకాదు అఖండ2 పై క్లారిటీ రావడంతో వాళ్లంతా సంతోషం వ్యక్తం చేశారు.