Buchi Babu: శ్మశానంలో అన్నాడు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు..బుచ్చిబాబు కామెంట్స్

Buchi Babu: శ్మశానంలో అన్నాడు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు..బుచ్చిబాబు కామెంట్స్

సౌత్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ గీతాంజలి. 2014లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు రాజ్ కిరణ్ తెరకెక్కించగా.. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, రావ్ రమేష్, బ్రహ్మానందం కీ రోల్స్ లో కనిపించారు. 

అయితే దాదాపు10 సంవత్సరాల తరువాత గీతాంజలి సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ అందిస్తున్న ఈ సినిమాను శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

టీజర్ నవ్విస్తూనే..గుండెల్లో భయం పెంచేతుంది. అయితే, టీజర్ రిలీజ్ ఈవెంట్కు ఇండస్ట్రీ నుంచి ప్రముఖ డైరెక్టర్స్ బాబీ, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సానా మరియు హీరో శ్రీ విష్ణు అటెండ్ అయ్యారు. 

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu) మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "కోన వెంకట్ గారు ఈ ఈవెంట్ గురించి చెబుతూ టీజర్ లాంచ్ చేసేది శ్మశానంలో అని చెప్పారు. నాకు భయం వేసింది. ఆ తరువాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈవెంట్ ప్లేస్ మార్చాం అని మళ్లీ వాయిస్ మెసెజ్ పెట్టారు. కోన వెంకట్ గారి పేరు కనిపిస్తే సినిమా ఇంపాక్ట్ ఓ లెవెల్లో ఉంటుంది. ఆయన రాసిన డైలాగ్స్‌ను ఆడియన్స్ ఇంటికి పట్టుకెళ్తారు. ఆయన డైలాగ్స్ లో ఎంతో లాజిక్స్‌ పంచ్‌‌లు ఉంటాయి. పదేళ్ల క్రితం వచ్చిన గీతాంజలితో నవ్వించారు..భయపెట్టారు. మళ్లీ ఇప్పుడు రాబోతోన్నారు. టీజర్ చూస్తూనే ఇంటెన్స్ గా ఉంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్" అని బుచ్చిబాబు సానా అన్నారు.

అయితే, గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా టీజర్ లాంచ్‌ను మొదట పంజాగుట్ట స్మశానవాటికలో రాత్రి 7 గంటలకి గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంఛ్ చేస్తున్నాం.అంటూ మేకర్స్  ప్రకటన చేసిన విషయం తెలిసిందే.ఇది చూసిన ఆడియన్స్ స్మశానంలో టీజర్ లాంచా..ఇదెక్కడి మాస్ ట్రెండ్ రా మావా అంటూ కామెంట్స్ చేశారు. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా చేయడం జరిగింది.

ఏది ఏమైనా ఈ వినూత్న నిర్ణయంతో గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా సోషల్ మీడియాలో ఫుల్లుగా ట్రెండ్ సెట్ చేశారు. అయితే, టీజర్ లాంచ్ ఈవెంట్ వేదిక మార్చినట్లు తెలిసింది. ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు RC16 రామ్ చరణ్ తో ఓ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.