బెల్లంపల్లి,వెలుగు: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని రామగుండం సీపీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఏఎంసీ స్టేడియంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని సీపీ ప్రారంభించి మాట్లాడారు. బెల్లంపల్లిలో ఒకే రోజు 2,500 మంది రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. ఏసీపీ ఎడ్ల మహేశ్మాట్లాడుతూ గత ఏడాది నిర్వహించిన రక్తదాన శిబిరంలో 1,030 మంది రక్తదానం చేయగా, ఇప్పుడు 2,500 మంది రక్తదానం చేశారని వివరించారు. ఈ శిబిరం రాష్ట్రంలోనే రికార్డన్నారు. కార్యక్రమంలో వన్ టౌన్, తాండూర్, బెల్లంపల్లి రూరల్ మందమర్రి సీఐలు ముష్క రాజు, కోట బాబురావు, కె.జగదీశ్, ప్రమోద్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ చందూరి మహేందర్, ట్రెజరర్పడాల రవీందర్, సభ్యులు కాసర్ల శ్రీనివాస్ మధుసూదన్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, ఎడ్ల కిషన్, నాగేందర్, బెల్లంపల్లి రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్ సురభి శరత్, సూరం లక్ష్మీనారాయణ, గజల్ మోహన్, కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్ద్వారా కార్మికుల సమస్యలు పరిష్కారం
నస్పూర్,వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే గ్రీవెన్స్సెల్నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మగళవారం శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు ఆయన హాజరయ్యారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా ట్రాన్స్ ఫర్లు, భూగర్భం నుంచి సర్ఫేజ్కు, మెడికల్పరమైనవే ఎక్కువగా ఉన్నాయన్నారు. నైనీ బ్లాక్ కు ఫారెస్టు అనుమతులు వచ్చాయని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. శ్రీరాంపూర్ జీఎం సంజీవ రెడ్డి, కార్పొరేట్ జీఎంలు బసవయ్య, ఆనంద్, ఏజీఎంలు దీక్షితులు, కవిత, పీఎం వరప్రసాద్, డీవైపీఎం అశోక్, శ్రీరాంపూర్ ఏరియా ఎస్వోటు జీఎం త్యాగరాజు, డీజీఎంలు శివరావు, గోవిందరాజు పాల్గొన్నారు.
పైలేరియా నివారణకు చర్యలు తీసుకోవాలి
భైంసా,వెలుగు: పైలేరియా నివారణకు ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు చర్యలు తీసుకోవాలని హెల్త్ సూపర్వైజర్ కలీమొద్దీన్ సూచించారు. మంగళవారం పట్టణంలోని అర్బన్ సెంటర్లో మీటింగ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వ్యాధిగ్రస్తులను గుర్తించి మందులు అందజేయాలన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రాజశ్రీ, అంగన్వాడీ టీచర్లు జయశ్రీ, మాధురి, నాగమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ట్రేడ్ మెన్ కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలి
మందమర్రి,వెలుగు: సింగరేణిలో పనిచేస్తున్న ట్రెడ్స్‌మెన్ కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్‌ప్రసాద్ కోరారు. మంగళవారం ఐఎన్టీయూసీ ప్రతినిధులు సింగరేణి డైరెక్టర్(పా,ఫైనాన్స్) బలరాంనాయక్‌ను కలిసి కార్మికులు సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జనక్ప్రసాద్మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో 60 నాగాలు చేశారని సాకును చూపుతూ ట్రేడ్‌మెన్ కార్మికులకు ప్రమోషన్లు నిలిపివేయడం దారుణమన్నారు. నాగాల నిబంధనను తొలగించి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 19,20 తేదీల్లో కార్మికుల సమస్యలపై సింగరేణి యాజమాన్యం మధ్య జరిగిన చర్చల్లో ఆంగీకరించిన 9 డిమాండ్లను అమలు చేయడంలో జాప్యం చేయడం తగదన్నారు. మెడికల్ అటెండెన్స్ రూల్స్ మార్చాలని, సీపీఆర్ఎంఎస్(హెల్త్‌కార్డు)లో లోపాలను సరిదిద్దాలని కోరారు. మహిళ ఉద్యోగుల రక్షణకు ప్రయారిటీ ఇవ్వాలన్నారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వార్డు అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిద్దంశెట్టి రాజమౌళి, పి.ధర్మపురి, పసునూటి రాజేందర్, జనరల్ సెక్రటరీ కాంపెల్లి సమ్మయ్య, జాయింట్‌సెక్రటరీ వంగ లక్ష్మీపతిగౌడ్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య, కె.సదానందం, కుక్కల ఓదెలు, శివ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగంలో ఉన్నప్పుడే పెన్షన్స్ స్కీమ్ లో చేరడం ఉత్తమం
ఆదిలాబాద్ టౌన్,వెలుగు: ఉద్యోగంలో ఉన్నప్పుడే ఉద్యోగ విరమణ తర్వాత ఉండే ప్రభుత్వ, ప్రైవేటు పెన్షన్ స్కీమ్‌లలో చేరడం ఉత్తమమని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా తొలి మహిళా హోంగార్డు తోట ఆశమ్మ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఎస్పీ చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. అనంతరం ఆమెను పోలీసు వెహికల్లో ఇంటికి పంపించారు. జిల్లాలో ఒక మహిళ హోంగార్డు ఉద్యోగ విరమణ చేయడం ఇదే మొదటిసారి అని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, హోంగార్డ్ ఆర్ఐఎం వంశీకృష్ణ, అడ్మిన్ ఆర్ఐడీ వెంకటి, హోంగార్డ్ ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
జన్నారం,వెలుగు: టీఆర్ఎస్ పాలనలో మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్ చెప్పారు. మంగళవారం మండలంలోని కొత్తపేట గ్రామంలో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. అంతకు ముందు మండల కేంద్రంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ఫండ్చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రాజారాంరెడ్డి, వైస్ ఎంపీపీ వినయ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సతీశ్, మాజీ వైస్ చైర్మన్ భరత్ కమార్, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.
