మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు

మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు

హైదరాబాద్ సిటీ పోలీసులపై ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ హరీశ్ శంకర్. పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని మరోసారి నిరూపించారన్నారు. హరీశ్ శంకర్ ఉండే జూబ్లీ ఎన్ క్లేవ్ రెసిడెన్సీ దగ్గరలో రాత్రి పూట ఎవరో పెద్ద పెద్ద సౌండ్ తో డ్రిల్లింగ్ పనులు చేపడుతున్నారు. వీటి వల్ల పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఇబ్బందిగా ఉందని ట్వీట్ చేశారు. రాత్రిపూట పెద్ద పెద్ద సౌండ్ తో  పనులకు మీరేమైనా అనుమతిచ్చారా?  న్యాయపరంగా కంప్లైంట్ ఇచ్చేముందు మీ సలహా తెలుసుకుందామని పోలీసులను అడిగారు.

హరీష్ శంకర్ ట్వీట్ కు స్పందించిన పోలీసులు అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్లి పనులను నిలిపి వేశారు. దీనికి హరీశ్ శంకర్ రీ ట్వీట్ చేస్తూ తాను నమ్మలేకపోతున్నానని..తన రిక్వెస్ట్ తో  ఇంత త్వరగా సమస్యను పరిష్కరించినందుకు పోలీసులకు  ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు..ఎప్పుడైనా రాగలరని నిరూపించారన్నారు.