
ప్రియమణి, సంజయ్ సూరి లీడ్ రోల్స్‌లో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘సర్వం శక్తిమయం’. బి.వి.ఎస్.రవి కథ అందించడంతో పాటు క్రియేటర్‌గా వ్యవహరించగా.. దర్శకుడు హేమంత్ మధుకర్ క్రియేటివ్ కన్సల్టెంట్. అంకిత్, విజయ్ చాడ, కౌముది కె నేమాని నిర్మించారు. సోమవారం ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 20 నుంచి ఆహా ఓటీటీ ద్వారా అందుబాటులోకి వస్తోంది. అష్టాదశ శక్తి పీఠాల నేపథ్యంలో తెరకెక్కించారు. తన సమస్యల పరిష్కారం కోసం ఒక వ్యక్తి కుటుంబంతో కలిసి అన్ని శక్తిపీఠాలు దర్శించుకునే క్రమంలో ఎదురయ్యే సంఘటనలు
అతనిలో వచ్చిన మార్పులు మెయిన్ కాన్సెప్ట్. మొత్తం పది ఎసిసోడ్‌లు ఉండే ఈ వెబ్ సిరీస్‌లో ఒక నాస్తికుడు ఆస్తికుడయ్యే ప్రయాణంతో పాటు సనాతన ధర్మం గురించిన చర్చ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సమీర్ సోని, సుబ్బరాజు, అభయ్ సింహా, అశ్లేష ఠాకూర్, కుషితా కల్లాపు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.