
లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ డిస్టర్బ్ అయ్యాయి. తిరిగి షూటింగ్ చేసుకునేందుకు పర్మిషన్ వచ్చినా.. అందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో వర్క్ అంతకంతకూ డిలే అవుతోంది. దాంతో ఇప్పటికే స్టార్టయిన కొన్ని ప్రాజెక్టులపై నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో జరుగుతోంది కూడా ఇలాంటి ప్రచారమేనట. పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న భారీ పిరియడ్ మూవీ షూటింగ్ కొంత జరిగింది. కానీ కరోనాతో ఆగింది. వ్యాక్సిన్ వచ్చాక తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు పీకే. కానీ చివరి దశలో ఉన్న ‘వకీల్ సాబ్’ షూటింగ్‌ని ముందుగా కంప్లీట్ చేయాల్సి ఉంది. దాంతో ఈ గ్యాప్‌లో వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు క్రిష్. అప్పట్నుంచీ పవన్ – క్రిష్ సినిమా ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. ఎట్టకేలకు క్రిష్ రియాక్టయ్యాడు. ‘ఈ ప్రచారంలో నిజం లేదు, మా సినిమాకి పవన్ బల్క్ డేట్స్ ఇచ్చారు. ‘వకీల్ సాబ్’ పూర్తవగానే మా సినిమా మొదలవుతుంది. ఈ గ్యాప్‌లో వైష్ణవ్ తేజ్ సినిమాని పూర్తి చేస్తాను’ అని క్లారిటీ ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ పవన్ ఓ సినిమాలో నటించాల్సి ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే కాబట్టి ఆ రోజు ‘వకీల్ సాబ్’ టీజర్ మాత్రం కచ్చితంగా వస్తుందని అభిమానులు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
For More News..