స్వీటీ స్టార్డమ్‌‌‌‌‌‌‌‌కు పర్ఫెక్ట్ యాప్ట్ ఘాటి

స్వీటీ స్టార్డమ్‌‌‌‌‌‌‌‌కు పర్ఫెక్ట్ యాప్ట్ ఘాటి

అనుష్క కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో ఐకానిక్ సినిమాగా ‘ఘాటి’ నిలుస్తుందని చెప్పారు క్రిష్‌‌‌‌‌‌‌‌.  అనుష్క లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో ఆయన తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు.  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5న సినిమా విడుదల సందర్భంగా చిత్ర విశేషాల గురించి క్రిష్‌‌‌‌‌‌‌‌ ఇలా వివరించారు.

ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ తూర్పు కనుమల్లో పెరిగే శిలావతి అనే గంజాయి రకం కోసం ఓ వ్యవస్థ పని చేస్తుంటుంది. వాటిని మోసే కూలీలను ఘాటీలు అని పిలుస్తారు. వాళ్ల నేపథ్యంలో డా. చింతకింద శ్రీనివాసరావు రాసిన కథ, వాళ్ల నేపథ్యం నాకు ఎక్సైటింగ్‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. దాన్ని డెవలప్‌‌‌‌‌‌‌‌ చేసే క్రమంలో అక్కడకు వెళ్లి చూశాక ఒక కొత్త ప్రపంచం, సంస్కృతిని చూపించవచ్చని ఈ చిత్రం స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశాం.

‘వేదం’ తర్వాత స్వీటీ (అనుష్క) గారితో మరో సినిమా చేయాలనే ఆలోచన ఉండేది. అందులోని సరోజ పాత్ర అంటే తనకెంతో ఇష్టం. ఆ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సీక్వెల్‌‌‌‌‌‌‌‌ చేయాలనే ఆలోచన కూడా ఉండేది. ఆర్గానిక్‌‌‌‌‌‌‌‌గా ఉండే కథ కోసం ఎదురుచూస్తున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో ‘ఘాటి’ కథ వచ్చింది. ఇందులోని శీలావతి పాత్ర స్వీటీ గ్రేస్‌‌‌‌‌‌‌‌, యాటిట్యూడ్‌‌‌‌‌‌‌‌, సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డమ్‌‌‌‌‌‌‌‌కి పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ యాప్ట్‌‌‌‌‌‌‌‌.  కమర్షియల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌తో స్వీటీ గారి కోసం చేసిన ఒక బిగ్ స్కేల్ మూవీ.

ఇది ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో కూడిన కాంప్లెక్స్ స్టోరీ. అయితే అక్కడి పరిస్థితుల నేపథ్యంలో దీన్ని యాక్షన్‌‌‌‌‌‌‌‌ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెబితేనే ఆసక్తికరంగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌లో ఆ ఎమోషన్ కనిపిస్తుంది. దీన్ని చాలా అందంగా, సినిమాటిక్ గా అన్ని జాగ్రత్తలు తీసుకుని లార్జెస్ట్ కాన్వాస్ ఉన్న సినిమాగా తీర్చిదిద్దాం. దేశిరాజుగా విక్రమ్ ప్రభు,  కుందుల నాయుడు అనే విలన్‌‌‌‌‌‌‌‌ పాత్రలో చైతన్య రావు చాలా బాగా నటించారు.   

విస్తృతమైన విషయాన్ని చాలా అందంగా,  సూటిగా చెప్పే సాయి మాధవ్ బుర్రా ఇందులోనూ ప్రేక్షకుల మనసులను తాకే డైలాగ్స్ రాశారు.  సిరివెన్నెల గారి శిష్యుడిగా ఇందులో నేను మూడు పాటలు రాశాను. డీవోపీ మనోజ్ ఆ పర్వత శ్రేణుల ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా క్యాప్చర్ చేశారు. మూవీ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టుగా సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్త రకమైన సంగీతం ఇచ్చారు.  

‘ఘాటి’ కథ పూర్తిగా ఫిక్షనల్‌‌‌‌‌‌‌‌. ఐడెంటిటీ, సర్వైవల్ థీమ్స్‌‌‌‌‌‌‌‌తో వస్తున్న సినిమా ఇది. వాళ్లు సర్వైవల్ కోసం చేసినా గంజాయి అనేది ఒక సోషల్ ఇష్యూ. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దీనిపై మన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ప్రభుత్వాలే కాకుండా పౌరులందరూ పోరాడాలి. ఈ సినిమా కూడా సమస్య నిర్మూలనకి ఊతమిస్తుంది కానీ గ్లోరీఫై చేసేలా ఉండదు.