HanuMan OTT Release: కనీసం అంచనా తేదీనైనా ప్రకటించండి!..మమ్మల్ని అర్థం చేసుకోండి

HanuMan OTT Release: కనీసం అంచనా తేదీనైనా ప్రకటించండి!..మమ్మల్ని అర్థం చేసుకోండి

థియేటర్స్ లో హనుమాన్ (HanuMan) హంగామా కాస్త తగ్గడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు చాల కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న విషయం తెలిసిందే.

అంతేకాదు..ఇటీవల మహాశివరాత్రి సందర్బంగా మార్చ్ 8న హనుమాన్ సినిమాను ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆడియన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. శివరాత్రి రోజున ఫ్యామిలీతో కలిసి హనుమాన్ సినిమా చూసేయొచ్చు అని అనుకున్నారు.

ఇక వారం కావోస్తోన్న ఇదిగో వస్తోంది..అదిగో వస్తోంది అంటూ ఆలస్యం చేస్తున్నారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్ రోజురోజుకు మరింత అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక నిన్న జీ5(ZEE5)రెస్పాన్స్ అవుతూ..త్వరలో వస్తున్నాం..అప్డేట్ కోసం మా అధికారిక ఖాతాను చూస్తూ ఉండండి అంటూ రిప్లై ఇచ్చింది. అయిన ఫ్యాన్స్ వినలేదు..మరోసారి  డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) రంగంలోకి దిగాడు.

తాజాగా ప్రశాంత్ ట్వీట్ చేస్తూ..‘హనుమాన్‌’ ఓటీటీ విడుదల ఆలస్యమవుతోంది. ఇది మేము ఉద్దేశపూర్వకంగా చేస్తోంది కాదు. వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి మా టీమ్ అవిశ్రాంతంగా పనిచేస్తోంది. మీకు ఉత్తమమైన సినిమాని అందిచాలన్నదే మా ఉద్దేశం.దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మాకు సపోర్ట్‌ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’ అని మరో పోస్ట్‌ పెట్టారు. అయిన కూడా నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘కనీసం అంచనా తేదీనైనా ప్రకటించండి’ అని వరుస కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి హనుమాన్ వచ్చే వరకు ఆగరు సామి.