విశ్వక్ పై కోపం లేదు కానీ.. ఆ విధానం నచ్చలేదు

విశ్వక్ పై కోపం లేదు కానీ.. ఆ విధానం నచ్చలేదు

బేబీ(Baby) సినిమా రిలీజైనప్పటి నుండి ఆ చిత్ర దర్శకుడు సాయి రాజేష్(Sai Rajesh) హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) వివాదాం ఎదో ఒక విదంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక తాజాగా ఈ వివాదంపై వస్తున్న వార్తలపై మరోసారి స్పందించారు దర్శకుడు సాయి రాజేష్. 

"బేబీ సినిమా సక్సెస్ మీట్ లో ఈ సినిమా కథను ముందు వేరేహీరోకి చెప్పానని చెప్పాను. ఆ హీరో విశ్వక్ సేన్ అది నిజమే. కానీ అయన నా కథ వినలేదు. దానికి కారణం కూడా నాకు తెలియదు. అవన్నీ పక్కన పెడితే విశ్వక్ బేబీ సినిమా కథకు నో చెప్పిన విధానం నాకు నచ్చలేదు. అంతటితో ఊరుకోకుండా.. నేను చెప్పిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ హిట్ ను ఎంజాయ్ చేయాలి కానీ.. నో చెప్పిన వారిని అవమానించొద్దు అని అనేసరికి నాకు చాల బాధేసింది. అలా అని విశ్వక్ పై నాకు కోపం లేదు. కానీ రిజెక్ట్ చేసే విధానం కాస్త రెస్పెక్టబుల్ గా బాగుండు అనేది నా అభిప్రాయం అని చెప్పుకొచ్చారు సాయి రాజేష్. 

ఇక బేబీ సినిమా విషయానికి వస్తే.. జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.75 కోట్లు కొల్లగొట్టింది. చాలా రోజుల తరువాత వచ్చిన అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కావడంతో కుర్రకారు ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్(Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా పలుచోట్ల హౌస్ ఫుల్ షోస్ తో రన్ అవుతోంది.