పవన్తో స్నేహం.. కోట్లు వెనకేసుకుంటున్న త్రివిక్రమ్

పవన్తో స్నేహం.. కోట్లు వెనకేసుకుంటున్న త్రివిక్రమ్

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Powerstar Pawan kalyan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుండి ఒక సినిమా వస్తుదంటేచాలు బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ అవడం ఖాయం. అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు దర్శకులు. ఆయన డేట్స్ దొరికితే చాలు వందల కోట్లు పెట్టడానికి సిద్దమయ్యే నిర్మాతలు కూడా ఉన్నారు.
 
అయితే ఇండస్ట్రీలో తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు.. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కాదు.. జస్ట్ ఆయన స్నేహితులవడం మూలంగా కూడా కోట్లు సంపాదించుకోవచ్చట. తాజాగా ఇదే విషయాన్ని ప్రూవ్ చేశారు స్టార్ దర్శకుడు త్రివిక్రమ్(Trivikram). ఆయన చివరగా పవన్ కళ్యాణ్ తో ఆజ్ఞాతవాసి(Agnathavasi) సినిమా చేశారు. ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ సినిమా తరువాత ఈ కాంబోలో ఇప్పటివరకు సినిమా రాలేదు. 

కానీ ఆతరువాత వచ్చిన పవన్ రెండు సినిమాల్లో కీలక పాత్ర పోషించారు త్రివిక్రమ్. రీసెంట్ గా పవన్ బీమ్లా నాయక్(Bheemla nayak) సినిమా చేయడంలో త్రివిక్రం పాత్ర చాలానే ఉంది. అంతేకాదు ఆ సినిమాకు రచయితగా కూడా చేశారు త్రివిక్రమ్. తాజాగా వస్తున్న బ్రో(Bro) సినిమా విషయంలో త్రివిక్రమే అన్నీ దగ్గరుండి చూసుకున్నారని సమాచారం. ఈ సినిమా కోసం కూడా త్రివిక్రమే దగ్గరుండి పవన్ ను ఒప్పించారట. ఈ రెండు సినిమాలను సెట్ చేసినందుకు గాను.. దాదాపు రూ.40కోట్లు తీసుకున్నారట త్రివిక్రమ్. ఇలా పవన్ సినిమా చేయడం వల్ల కాదు.. స్నేహితుడవడం వల్ల కూడా కోట్లు వెనకేసుకుంటున్నారు త్రివిక్రమ్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.