
నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri kalyan ram) కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అంటే బింబిసారా(Bimbisara) అనే చెప్పాలి. కొత్త దర్శకుడు వశిష్ట(Vasista) తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా రూ.60 కోట్ల గ్రాస్ రాబట్టి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో క్రూరమైన బింబిసారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా సాధించిన భారీ సక్సెస్ తో.. బింబిసారా సినిమాకు సీక్వెల్ ఉంటుందని కూడా అనౌన్స్ చేశారు దర్శకుడు వశిష్ట. ఇక అప్పటి నుండి ఈ సీక్వెల్ పనిలోనే ఉన్నాడట వశిష్ట. అందుకే తన తరువాతి సినిమాను కూడా ప్రకటించలేదు ఈ దర్శకుడు.
ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. బింబిసారా సినిమా సీక్వెల్ నుండి తప్పుకున్నాడట దర్శకుడు వశిష్ట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. బింబిసారా కథా చర్చల్లో వచ్చిన విభేదాల కారణంగానే దర్శకుడు వశిష్ట ఈ సీక్వెల్ నుండి తప్పుకున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ మరి విశేషం ఏంటంటే.. ఈ ప్రాజెక్టు నుండి కేవలం దర్శకుడు మాత్రమే చేంజ్ అవుతున్నాడు. త్వరలోనే బింబిసారా ప్రాజెక్టు పట్టాలెక్కనుంది కానీ.. కొత్త దర్శకుడు లైన్లోకి రానున్నాడు. మరి ఆ కొత్త దర్శకుడు ఎవరు అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.