నటనే రానివారు స్టార్ హీరోలు.. ఆ టీజర్ ఒక చెత్త : వివేక్ అగ్నిహోత్రి

నటనే రానివారు స్టార్ హీరోలు.. ఆ టీజర్ ఒక చెత్త : వివేక్ అగ్నిహోత్రి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), అయన హీరోగా చేసిన సలార్(Salaar) సినిమాను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేశారు ది కాశ్మీర్ ఫైల్స్(The kashmir files) దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Ranjan Agnihotri). ప్రభాస్ కు అసలు యాక్టింగ్ రాదనీ, మల్లి అతన్ని పాన్ ఇండియా స్టార్ అంటారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి చేసిన ఈ కామెంట్స్ సంచలంగా మారాయి. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. పాన్ ఇండియాలో లెవల్లో భారీగా తెరకెక్కుస్తున్న ఈ సినిమాను కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ టీజర్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ను కూడా మెప్పించింది. అంతేకాదు.. సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది ఈ సినిమా.

అయితే తాజాగా సలార్ సినిమా టీజర్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి."ఎవరు పుట్టుకతోనే హింసాత్మకంగా మారారు. మీ పిల్లల మనసులను శాంతివైపు నడిపించండి.ప్రస్తుత కాలంలో హింసను గ్లామరైజ్ చేయడం ఫ్యాషన్ ఐపోయింది. సినిమాల్లో మితిమీరిన వాయిలెన్స్ చూపించడం, అలాంటి సినిమాలను ప్రమోట్ చేయడం, అసలు నటులే కాని వాళ్ళను బిగ్గెస్ట్ స్టార్స్ అని చెప్పుకోవడం పెద్ద టాలెంట్‌ అనుకుంటున్నారు. ఆలాంటి వారికి ఫ్యాన్స్ అని చెప్పుకునే వారికి కూడా అసలు ఏమీ తెలియదని అర్థం చేసుకోవాలి" అంటూ ప్రభాస్ ని ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్ ట్వీట్ చేశాడు వివేక్. వివేక్ చేసిన ఈ ట్వీట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చిత్ర విచిత్రమైన కామెంట్స్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు.