బడ్జెట్ లో వికలాంగుల కోటాను ఎత్తివేయాలని చూస్తే ఊరుకోం

బడ్జెట్ లో వికలాంగుల కోటాను ఎత్తివేయాలని చూస్తే ఊరుకోం

హైదరాబాద్ : మలక్ పేటలోని వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు వికలాంగులు. 2017 నుంచి  పెండింగులో ఉన్న 7 వేల మంది దరఖాస్తులకు 100 శాతం సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి దరఖాస్తులను పెండింగ్ లో పెట్టి, ఇప్పుడు మళ్లీ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలంటున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ వికలాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య. బడ్జెట్ లో వికలాంగుల కోటాను ఎత్తివేయాలన్న ఎత్తుగడతోనే ఈ శాఖను సీఎం కేసీఆర్…  స్త్రీ సంక్షేమ శాఖ లో విలీనం చేశారని ఆరోపించారు.