ధనవంతులకు.. బాగా డబ్బున్న వారికి కష్టాలు ఉండవనుకుంటున్నారా.. వారి ఎక్కడిపడితే అక్కడికి వెళితే వారికుండే ఇబ్బందులేంటి.. కోటీశ్వరుల భార్యలు పడే ఇబ్బందులు ఏంటి.. తాజాగా దుబాయ్ లో నివసించే జమాల్ అనే మిలియనీర్ భార్య పడే కష్టాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కోటీశ్వరుడి భార్య అయితే డబ్బుకు కొదవేముంటుంది. వారు ఏం కావాలంటే అది క్షణాల్లో వారి ముందుకు వస్తుంది. ఆమె ఎక్కడిపడితే అక్కడికి ఆమె కోరుకున్న వాహనంలో వెళ్లవచ్చు. అయినా దుబాయ్ లో ఓ విలాసవంతుడి భార్యకు కష్టాలున్నాయని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు దుమారం రేగుతోంది.బ్రిటీష్ కు చెందిన సౌదీ మహిళ 2020లో మిలియనీర్ ( కోటీశ్వరుడు) జమాల్ ను వివాహం చేసుకుంది. వారిద్దరూ దుబాయ్ లో ఓ ప్యాలెస్ లో నివసిస్తున్నారు. జమాల్ టిక్ స్టార్ ఆర్టిస్ట్. కోట్లకు అధిపతైన జమాల్ ఆయన భార్య కూడా విలాసవంతంగా ఉండాలని కోరుకుంటాడు. ఇది ఎంతో అద్భుతమైన జీవితం అని అందరూ అనుకుంటారు. అయితే జమాల్ భార్య ఓ విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎంతో విలాసవంతంగా గడిపేందుకు డబ్బు ఖర్చు పెడతారు. ఏది కావాలంటే అది తినవచ్చు.. కావలసిన విధంగా ఎంజాయి చేయండి అనే పోస్ట్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.
దుబాయ్ లో నివసించే టిక్ స్టార్ జమాల్ భార్య తాను .. వివాహం చేసుకున్న తరువాత చాలా రాజీపడ్డానని ఆవేదన వ్యక్తం చేసింది. తాను వేరే ఎవరితో స్నేహం చేసే అవకాశం లేకుండా పోయిందని తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చట్టం ప్రకారం ఆ వ్యక్తి రెండో వివాహం చేసుకోవచ్చు కాని ఎవరితో కూడా మాట్లాడకూడదంటం ఎంతవరకు సమంజసమని తెలిపింది. తన భర్త ఎక్కడ ఉన్నా.. 24 గంటలు తన ఫోన్ ట్రాకర్ లో ఆన్ లైన్ లో ఉండాలని సౌదీ మహిళ తెలిపింది. ఆమె ఎక్కడ ఉన్నా .. ఏం చేస్తున్నా.. జమాల్ చూస్తూ.. ఆదేశాలు జారీ చేస్తాడని...కాని తన భర్త ఎక్కడ ఉండేది .. ఎక్కడ నుంచి ఫోన్ లో మాట్లాడే విషయం తెలియదని ఆమె తెలిపింది. అయితే ఆమె భద్రత కోసమైతే అది చాలా మంచిగా ఉండేదని.. రౌండ్ ద క్లాక్ అలా చేయవలసిన అవసరం లేదు కదా అని జమాల్ భార్య అన్నారు. ఆమె ఏంతినాలో.. ఏం తినకూడదో ..ఎప్పుడు తినాలో కూడా ఆయనే చెపుతాడని తెలిపారు.
కోటీశ్వరుడి భార్య కావడం వల్ల తాను ఇబ్బందులు పడుతున్నానని జమాల్ భార్య చెప్పింది. తాను తన భర్తతో ఎప్పుడే బయటకు వెళ్లలేదని..భర్త ఆనందం కోసం ఆమె ఎప్పుడూ కష్టపడుతూ ఉండాలన్నారు. డబ్బున్నంత మాత్రాన స్వేచ్చ జీవితం లేకపోతే పడే అనుభవించే మానసిక వేదన అంతా ఇంతా కాదని తెలిపింది. మహిళలకు కూడా స్వేచ్చ ఉండాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. భర్తకుండే స్వేచ్ఛ భర్తకు.. భార్యకు ఉండే స్వేచ్ఛ భార్యకు ఉండాలని జమాల్ భార్య తెలిపారు. కొత్త బ్రాండింగ్ లేకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు కాని అలాంటి వారితో జీవించడం చాలా కష్టంగా ఉందని తెలిపారు. ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పై నెటిజన్లు స్పందించారు. ఇది ఒక పీడకల అని ఒకరు అనగా మరొకరు డబ్బు ప్రేమను.. ఆనందాన్ని కొనలేదని కామెంట్ చేశారు. సో... డబ్బు అవసరానికి మించి ఎక్కువ ఉంటే వచ్చే ఇబ్బందులు అంతా ఇంతా కాదని గుర్తించాలి.
