రాష్ట్ర కేడర్‌‌‌‌‌‌‌‌లోని ఐఏఎస్‌‌‌‌లలో విభేదాలు

రాష్ట్ర కేడర్‌‌‌‌‌‌‌‌లోని ఐఏఎస్‌‌‌‌లలో విభేదాలు
  • సన్మానించేందుకు సీఎస్ ఆహ్వానం.. 9 మంది ఆఫీసర్లు వెళ్లలే
  • గతంలో లేని విలువ, గౌరవం ఇప్పుడెందుకని ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేడర్‌‌‌‌‌‌‌‌లోని ఐఏఎస్‌‌‌‌లలో విభేదాలు బయటపడ్డాయి. కొందరు సీనియర్ ఐఏఎస్‌‌‌‌లకు మంచి పోస్టులు దక్కకపోగా.. పదవీవిరమణ టైంలో గౌరవప్రదమైన వీడ్కోలు దక్కడం లేదని విమర్శలున్నాయి. ఎవరైనా ఐఏఎస్ రిటైర్ అయితే సత్కారం అయినా చేసి పంపిస్తారు. కానీ గతేడాదిలో పదవీవిరమణ చేసిన ఐఏఎస్‌‌‌‌లకు అలాంటివేమీ జరగలేదు. వారంతా సీఎస్ వర్గం కాదనే కారణంతో గౌరవప్రదంగా పంపలేదనే చర్చ జరుగుతున్నది. ఐఏఎస్ లుగా రిటైరైన 11 మందికి డిసెంబర్ 31న సన్మానం చేయనున్నట్లు సీఎస్ ఆఫీస్ నుంచి కబురు వెళ్లింది.

ఈ ప్రోగ్రాంకు ప్రభుత్వం నుంచి రెండేండ్ల స్పెషల్ ఎక్స్‌‌‌‌టెన్షన్ వచ్చిన ఆధర్ సిన్హా, అర్విందర్ సింగ్ మాత్రమే హాజరయ్యారు. శాలిని మిశ్రా, చం పాలాల్, శర్మన్, ఒమర్ జలీల్, ప్రీతి సుడాన్ సహా 9 మంది రాలేదు. తమకు పోస్టింగుల్లో ప్రాధాన్యం ఇవ్వలేదని, పదవీ విరమణ సమయంలోను గౌరవంగా పంపలేదని వారు ఆవేదనలో ఉన్నారు. ఒక వర్గం ఐఏఎస్‌‌‌‌లకే ప్రాధాన్యం ఉందని.. అందుకే తాము ఆ ప్రోగ్రాంకు అటెండ్ కాలేదని పేర్కొంటున్నారు.