90 రోజుల వరకు మెసేజ్‌‌ డిసప్పియర్ మోడ్‌‌

90 రోజుల వరకు మెసేజ్‌‌ డిసప్పియర్ మోడ్‌‌

చాట్ వల్ల ఫోన్‌‌ స్టోరేజ్ ఫుల్‌‌ అవుతుందని డిసప్పియర్‌‌‌‌ చాట్‌‌ను తీసుకొచ్చింది వాట్సాప్‌‌. అందులో 24 గంటల నుంచి 90 రోజుల వరకు మెసేజ్‌‌ డిసప్పియర్ మోడ్‌‌ పెట్టొచ్చు. అయితే ఆ గడువు పూర్తవ్వగానే ఒక్కోసారి అనుకోకుండానే ఇంపార్టెంట్‌‌ డాటా డిలీట్‌‌ అయిపోతుంది. అలా కాకుండా డిసప్పియర్​ మెసేజ్​లను స్టోర్​ చేసుకునేందుకు కొత్త అప్​డేట్​ తీసుకొచ్చింది వాట్సాప్​​. ఈ డిసప్పియర్‌‌‌‌ మెసేజ్‌‌ల స్టోర్‌‌‌‌ను ఎనేబుల్‌‌ చేసుకుంటే డిలీట్‌‌ అయిన మెసేజ్‌‌లు అందులో స్టోర్‌‌‌‌ అవుతాయి. ఈ మోడ్‌‌ వాట్సాప్‌‌ కాంటాక్ట్‌‌ ఇన్‌‌ఫర్మేషన్‌‌ ఓపెన్‌‌ చేశాక ‘కెప్ట్‌‌ మెసేజ్‌‌ ఆప్షన్‌‌’లో ఉంటుంది.