
- హ్యుండాయ్ వెహికల్స్‌పై 1.50 లక్షల వరకు తగ్గింపు
- కొన్ని మోడల్స్‌కు కార్పొరేట్ డిస్కౌంట్లు
- మరికొన్నింటికి ఎక్సేంజ్ బోనస్‌లు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యుండాయ్ గ్రాండ్ ఐ 10, ఐ 20 సహా పలు మోడళ్లపై రూ .1.50 లక్షల వరకు డిస్కౌంట్లు, ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ప్రకటించింది. ఈ నెలంతా ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొంది. గత నెల అమ్మకాలు బాగున్నాయని, ఈ నెలలోనూ డిమాండ్ ఉందని తెలిపింది. డిమాండ్‌ను కొనసాగించడానికి క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, కార్పొరేట్ డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే టక్సన్, వెన్యూ, క్రెటా, ఎలంట్రా, వెర్నా మోడళ్లపై డిస్కౌంట్లు ఇవ్వడం లేదు. - హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్ వెహికల్‌పై రూ.1.50 లక్షల క్యాష్ డిస్కౌంటు ఇస్తున్నారు. ఐ20 కారు ఐఎమ్‌టి టర్బో ట్రిమ్ రూ .25 వేల తగ్గింపుతో లభిస్తోంది. డీజిల్ వేరియంటుపై రూ .10 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ తోపాటు రూ .5 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. గ్రాండ్ 10 నియోస్ టర్బో మోడల్ పై రూ .35 వేల డిస్కౌంటు పొందవచ్చు. మాగ్నా ట్రిమ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ధరను రూ .25 వేలు తగ్గించారు. గ్రాండ్ 10 నియోస్ ఎరా, ఆస్టా స్పోర్ట్జ్ మోడళ్లను రూ .15 వేల తగ్గింపుతో కొనుక్కోవచ్చు. ఏఎమ్‌టి వేరియంట్‌కు కూడా రూ .10 వేల క్యాష్ డిస్కౌంట్ వర్తిస్తుంది. మిగతా అన్ని మోడల్స్ పై ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వరుసగా రూ.10 వేలు, రూ.ఐదు వేలుగా ఉన్నాయి. ఎస్‌యూవీ ఆరా కొంటే రూ .10 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. అన్ని ఆరా మోడళ్లపై రూ. ఐదు వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది. టర్బో వేరియంట్ రూ .35 వేల నగదు తగ్గింపుతో లభిస్తుండగా, ఇదే కారు ఏఎమ్‌టి వెర్షన్‌కు రూ .10 వేల క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది. ఆరా ఇతర మోడళ్లపైనా రూ.10 వేల దాకా క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ఎంట్రీ లెవెల్ కారు శాంత్రో మోడల్స్.. మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా ట్రిమ్స్ మోడళ్లపై రూ .25 వేల క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది. ఎరాతోపాటు సీఎన్జీ వేరియంట్ల ధర 10 వేలు తగ్గింది. శాంత్రో అన్ని మోడల్స్ పై రూ .10 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .5000 కార్పొరేట్ డిస్కౌంట్లు ఉంటాయి.