ఎమ్మెల్సీ రేసులో దాసోజు శ్రవణ్.? కేసీఆర్ ఫైనల్ చేస్తాడా?

ఎమ్మెల్సీ రేసులో దాసోజు శ్రవణ్.?  కేసీఆర్ ఫైనల్ చేస్తాడా?

దాసోజు శ్రవణ్..ఒకప్పుడు కేసీఆర్ రైట్ హ్యాండ్. కొన్ని కారణాలతో వేరే పార్టీల్లో చేరినా..రీసెంట్ గా సొంత పార్టీలోకి తిరిగొచ్చారు. ఉద్యమం టైం లో సీఎం కేసిఆర్ తో శ్రవణ్ వెన్నంటి వున్నారు. పార్టీ థింక్ ట్యాంక్ గా ఉన్నారు.  తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వీడి కొన్నాళ్లు కాంగ్రెస్, కొన్ని నెలలు బీజేపీలో కొనసాగారు. మునుగోడు బైపోల్ అప్పుడు..టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఇప్పటివరకు దాసోజు శ్రవణ్ కు పార్టీలో ఎలాంటి ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వస్తున్న ఇతర రాష్ట్రాల లీడర్ల రాకపోకలకు సమన్వయం చేయడం, వాళ్లు వచ్చినప్పుడు దగ్గరుండి తీసుకురావడం లాంటి సందర్భాల్లో మాత్రమే శ్రవణ్ కనిపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రసంగాలకు స్క్రిప్ట్ ప్రిపరేషన్ లో సాయం చేస్తున్నట్లు కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. 

ఇంతకీ శ్రవణ్ కు ఏం పోస్ట్ ఇవ్వబోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మొదటి నుంచీ ఖైరతాబాద్ పై శ్రవణ్ కు ఇంట్రస్ట్ ఉంది. గతంలో ఇక్కడ నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రవణ్ పోటీ చేసి ఓడిపోయారు. ఖైరతాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. లెటెస్ట్ ఎమ్మెల్సీ రేసులో శ్రవణ్ పేరు వినిపిస్తోంది. గవర్నర్ కోటాలో దాసోజుకు ఎమ్మెల్సీ ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ప్రచారం పార్టీలో ఉంది. దీనిపై పెద్దల హామీ ఉందన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో ఉంది.

 పార్టీకి సేవల విషయంలో అప్పుడు, ఇప్పుడు శ్రవణ్ రోల్ ఏం మారలేదంటున్నారు కొందరు నేతలు. వాడుకోవడం సరే దానికి తగిన గౌరవం మాటేంటన్నదే చాలామంది లీడర్లలో ఉన్న ప్రశ్న. ఇట్ల వెయిటింగ్ లో ఉన్నవాళ్లు, హామీలు తీసుకున్నోళ్లు పార్టీలో చాలామందే ఉన్నారంటున్నారు. సారు హామీల వెయిటింగ్ లిస్టులో ఎంత మంది ఉన్నా..సారు ఫైనల్ చేసే దాకా ఎవరికీ గ్యారంటీ లేదని పార్టీలో తలపండిన చాలామంది లీడర్లు చెబుతున్నమాట.