కేంద్ర ప్రతిపాదనలు రైతులకు మేలు చేసేలా లేవు: రైతు సంఘం నేతలు

కేంద్ర ప్రతిపాదనలు రైతులకు మేలు చేసేలా లేవు: రైతు సంఘం నేతలు
  • పంటల కనీస మద్దతు ధర చట్టబద్దతపై వెనక్కి తగ్గని రైతులు 
  • ఢిల్లీలో శాంతియుత ఆందోళన నిర్వహిస్తాం
  • కేంద్రంలో రైతు సంఘం నేతల చర్చలు విఫలం..
  • ఫిబ్రవరి 21 నుంచి ఛలో ఢిల్లీ కొనసాగింపు

పంటల కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలంటూ ఆందోళనకు చేపట్టిన రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. నాలుగో విడత జరిగిన చర్చల్లో..కేంద్రం ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు చెప్పిన రైతు సంఘా నేతలు.. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేవన్నారు. కేంద్రంతో చర్చలు విఫలమైన క్రమంలో ఫిబ్రవరి 21 నుంచి ఢిల్లీ కి తమ పాదయాత్రను కొనసాగిస్తామని రైతులు ప్రకటించారు.

ఢిల్లీలో శాంతియుత ఆందోళన నిర్వహిస్తామన్నారు రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్. మరోవైపు ఈ నెల 23న ఢిల్లీ మార్చ్  చేపట్టనున్నట్లు నొయిడా, గ్రేటర్  నొయిడా రైతులు తెలిపారు. భూసేకరణకు పరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్ల అప్పగింత డిమాండ్లు నెరవేర్చాలన్నారు.

also read : అయోధ్య గుడి ప్రారంభోత్సవానికి ఒక్క దళితుడినైనా పిలిచిండా?: రాహుల్ గాంధీ


అటు ఏడోరోజు రైతుల ఆందోళనతో హర్యానా, పంజాబ్ బార్డర్ లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. శంభు సరిహద్దుల్లో వేలాది ట్రాక్టర్లతో రైతులు నిరసనకు దిగారు. హర్యానా సరిహద్దులోనూ పెద్దఎత్తున రైతులు బారులు తీరారు. ముందస్తుగా అంబాల, కురుక్షేత్ర, టిక్రి సరిహద్దులో బారికేడ్లు, ఇనుపకంచెలు, సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేశారు. అటు ముందస్తుగా హర్యానా, పంజాబ్ సరిహద్దులో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.