భార్య-భర్తల బంధం ముందు ఏదీ నిలవదని అంటారు. కానీ.. ఒక్క ఉల్లిపాయ చాలు విడగొట్టడానికి అని ఈ జంట రుజువు చేసింది. ఉల్లిపాయ కోసం 11 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేక్ చెప్పారు. ఉల్లి, వెల్లుల్లి కోసం విడాకులు తీసుకున్న ఈ ఆదర్శ దంపతుల గురించి సోషల్ మీడియాలో పెద్ద డిబేటే నడుస్తోంది.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది ఈ ఘటన. 2002 లో పెళ్లి చేసుకున్న ఇద్దరు దంపతులు.. ఆహారపు అలవాట్ల మొదట ఒకేలా ఉన్నా తర్వాత మారిపోయాయి. స్వామినారాయణ్ ఫాలోవర్ అయిన మహిళ.. తన డైట్ లో ఉల్లి, వెల్లుల్లి ని అవాయిడ్ చేసింది. అదే క్రమంలో భర్తను కూడా తినొద్దని రిస్ట్రిక్షన్స్ పెట్టింది.
ఇంట్లో వంటల్లో ఉల్లిపాయలు నిషేధించాలని భార్య ట్రై చేసింది. కానీ అలవాటు ప్రకారం భర్త, అతని తల్లి ఉల్లిపాయలు వాడకుండా ఉండలేకపోయారు. ఈ విషయంలో చాలా రోజులుగా ఆ ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయి.
వేర్వేరు వంట.. వేర్వేరు డైనింగ్.. వేర్వేరు వస్తువులు:
మొదట ఉల్లిపాయతో మొదలైన వేర్పాటు.. ఆ తర్వాత వెల్లుల్లి వరకు వచ్చింది. ఆ తర్వాత ఆ భార్య వంట విడిగా వండుకోవడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా అద్దం, దువ్వెన.. ఇలా వస్తువులన్నింటినీ సపరేట్ గా వాడటం మొదలు పెట్టింది. తమను అంటరాని వారిగా చూస్తున్నట్లు ఆ కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారి మధ్య వాగ్వాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. 2007 లో పాపతో కలిసి తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది.
2013 నుంచి కోర్టు తిప్పలు:
భార్య విచిత్ర ప్రవర్తనపై భర్త 2013లో అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టుకెక్కాడు. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ నుంచి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసినట్లు కోర్టుకు విన్నవించాడు. ఇంట్లో ఉద్రిక్తలు, వివాదాలతో విసిగిపోయినట్లు కోర్కుకు చెప్పుకున్నాడు. గతంలో ఫ్యామిలీ కోర్టుకు కూడా వెళ్లగా.. 2024 లో విడాకులు మంజూరు చేసింది. ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందిగా భర్తకు ఆదేశించింది.
విడాకులను సమర్ధించిన హైకోర్టు:
ఫ్యామిలీ కోర్టు ఆదేశాల ప్రకారం మెయింటెనెన్స్ సరిగ్గా ఇవ్వటం లేదని హైకోర్టులో పిటిషన్ వేసింది మహిళ. మొత్తం 13 లక్షల 2 వేలు భరణం ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 2 లక్షల 72 వేలు మాత్రమే ఇచ్చాడని.. 18 నెలలుగా చెల్లించడం లేదని తెలిపింది. దీంతో పిటిషన్ మరో 4 లక్షల 27 వేలు చెల్లించాడు. మిగతా మొత్తాన్ని చెల్లించాల్సింది హైకోర్టు ఆదేశించింది. భార్యాభర్తలకు విడాకులు ఇచ్చిన అహ్మదాబాద్ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది.ఆహారపు అలవాట్లు పొందనప్పుడు.. బలవంతంగా కలిసి ఉండాల్సిన పని లేదని చెప్పింది.
ఈ దంపతుల విడాకులపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేవుడిపై భక్తి ఉండాలి కానీ.. విడాకులు తెచ్చుకునేంతలా కాదని కొందరు అంటున్నారు. ఎవరో ఒకరు తగ్గాల్సిందని.. భర్త కోసం భార్య అడ్జస్ట్ అయినా బాగుండేది. భార్య కోసం భర్త ఉల్లిపాయలు వదులుకున్నా ఇంతవరకు వచ్చేది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనేం.. ఉల్లి తెచ్చిన తంటా.. ఒక కుటుంబం రోడ్డున పడేలా చేసింది.

