షెడ్యూల్ 9,10 లోని సంస్థల్ని పంచండి : సుప్రీంకోర్టులో ఏపీ పిటిషన్

షెడ్యూల్ 9,10 లోని సంస్థల్ని పంచండి : సుప్రీంకోర్టులో ఏపీ పిటిషన్

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ పునర్విభజన చట్టంలో షెడ్యూలు– 9(91 సంస్థలు), షెడ్యూల్–10(142 సంస్థలు) లోని సంస్థలతో పాటు మరో 12 సంస్థల ఆస్తులు పంచాలంటూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదిన్నరేండ్లు అవుతున్నా వాటి పంపకాలు ప్రారంభంకాలేదని తెలిపింది. 

ఆస్తుల విభజన జరగకపోవడం వల్ల ఆయా సంస్థల పనితీరుపై ప్రభావం పడుతోందని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌ శుక్రవారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఆర్టికల్‌‌ 14, 21 ద్వారా సంక్రమించిన హక్కులతో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలని కోరింది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు న్యాయంగా విభజన చేయాలని కోరింది.