
మెదక్, వెలుగు: ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు ఓటర్లను రకరకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. చాలాచోట్ల ఓటర్లకు పైసలు పంచుతుండగా, మరికొన్నిచోట్ల మందు ఇస్తున్నారు. ఇంకొన్నిచోట్ల గిఫ్టులు పంచుతున్నారు. మెదక్ పట్టణంలోని 10వ వార్డులో ఓ అభ్యర్థికి ఓట్లు వేయాలంటూ కొందరు వ్యక్తులు బుధవారం కోళ్లు పంపిణీ చేశారు.
ఆటోలో కోళ్లు తెచ్చి ఇంటికొకటి చొప్పున పంచుతుండగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు గమనించి విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఆటోలో తీసుకొచ్చిన 70 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కోళ్లు పంపిణీ చేస్తున్న వినోద్, నారాయణ, మల్లేశంపై కేసు నమోదు చేశారు.