పేదల కడుపునింపుతున్న ‘కాకా’ ఫౌండేషన్

పేదల కడుపునింపుతున్న ‘కాకా’ ఫౌండేషన్

గోదావరిఖని, వెలుగు :  కరోనా వైరస్‌‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్‌‌ డౌన్‌‌ విధించడం వల్ల పనులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు ‘కాకా’ వెంకటస్వామి ఫౌండేషన్​అండగా నిలుస్తున్నది. మాజీ ఎంపీ డాక్టర్‌‌ జి.వివేక్‌‌ వెంకటస్వామి ఆదేశాల మేరకు పౌండేషన్‌‌ ఆధ్వర్యంలో బియ్యం, సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం గోదావరిఖనిలోని 40వ డివిజన్‌‌ లక్ష్మీనగర్‌‌, అశోక్‌‌నగర్‌‌ ఏరియాల్లో 150 మంది పేదలకు ఫౌండేషన్ ప్రతినిధి పి.మల్లికార్జున్‌‌, బీజేపీ కార్పొరేటర్‌‌ దుబాసి లలిత, మల్లేశ్‌‌ బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సునీల్ కుమార్, సురేందర్, రాజశేఖర్, రాజేందర్, వెంకటేష్, సచిన్, యూత్ సభ్యులు రాము, ప్రేమ్, హరి, సాగర్,  వెంకటేష్, శేషు, రాజేష్, ధరన్,  సాయి కీర్తన్, వినయ్, ఇందారపు రవి, ఇటికాల బుచ్చిరాజు, టి.రాజయ్య, ఎం.లక్ష్మణ్, జిల్లెల శ్రీనివాస్, వి.లక్ష్మణ్, కె.నర్సింగ్ పాల్గొన్నారు. అలాగే  అంతర్గాం మండలం పెద్దంపేట్​లో కూడా ఫౌండేషన్ సభ్యులు గడ్డం మధు ఆధ్వర్యంలో  60 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. కార్యక్రమంలో  అంతర్గాం ఎంపీడీఓ యాదగిరి నాయక్, పెద్దంపేట్ సర్పంచ్‌‌ మేర్గు భాగ్యమ్మ, గురువయ్య గౌడ్,  వార్డు సభ్యులు మహేష్, కుమార్, కో ఆప్షన్ సభ్యులు ఆముల రాములు, బూసిపాక సంతోష్, కోటి యాదవ్, మేర్గు అంజయ్య, పల్లెర్ల శ్రీనివాస్, శ్రవణ్, ప్రదీప్, రమేష్, సాగర్ పాల్గొన్నారు.