గణేష్ నిమజ్జనం.. MGBSకు వచ్చే బస్సులను దారి మళ్లింపు

 గణేష్ నిమజ్జనం..  MGBSకు వచ్చే బస్సులను దారి మళ్లింపు

హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్బంగా జిల్లాల నుంచి ట్యాంక్ బండ్ మీదుగా MGBSకు వచ్చే బస్సులను దారి మళ్లించడం జరిగిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్  ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  

కరీంనగర్ వైపు నుంచి వచ్చే బస్సులు JBS, YMCA, సంగీత్ క్రాస్ రోడ్స్, తార్నాక, జమై ఉస్మానియా, నింబోలి అడ్డా, చాదర్ ఘట్ మీదుగా MGBS వెళ్తాయి. 

బెంగళూర్ వైపు నుంచి వచ్చేవి.. ఆరంఘర్ క్రాస్ రోడ్స్, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్, IS సదన్, నల్గొండ క్రాస్ రోడ్స్, చాదర్ ఘట్ మీదుగా నడుస్తాయి. 

ముంబై వైపు నుంచి వచ్చే బస్సులు గోద్రెజ్ వై జంక్షన్, నర్సాపూర్ క్రాస్ రోడ్స్, బోయిన్ పల్లి, JBS, సంగీత్ క్రాస్ రోడ్స్, తార్నాక, జమై ఉస్మానియా, నింబోలి అడ్డా మీదుగా వెళ్తాయి. 

గురువారం(ఈ రోజు) ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం(రేపు) ఉదయం 8 గంటల వరకు మాత్రమే పైన పేర్కొన్న రూట్లో బస్సుల దారి మళ్లింపు ఉంటుంది. ఆ తర్వాత యథావిధిగా నడుస్తాయి. 

గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టడం జరిగింది. గ్రేటర్ లో ఇవాళ 535 ప్రత్యేక బస్సులను TSRTC ఏర్పాటు చేసిందని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో సంబంధిత DMలు అందుబాటులో ఉండాలని, పోలీస్ అధికారులతో వారిని సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది.