“డివిడెండ్ నా రక్తంలో ఉంది” అని వేదంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వల్ ప్రకటించారు. షేర్‌హోల్డర్లకు లాభాల పంపిణీ కొనసాగుతుందని, అదే సమయంలో 20 బిలియన్ డాలర్లతో బిజినెస్‌ను విస్తరిస్తామని తెలిపారు.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వేదాంతను ఐదు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా విభజించడానికి ఆమోదం తెలిపింది. ఈ డీమెర్జర్ ద్వారా బేస్ మెటల్స్, అల్యూమినియం, పవర్, స్టీల్ అండ్ ఐరన్, ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారాలు స్వతంత్రంగా పనిచేస్తాయి.
వేదాంత షేరు రూ.582 దగ్గర ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే షేరుకు రూ.7, రూ.16 ఇంటెరిమ్ డివిడెండ్స్ ఇచ్చింది.
