ఏపీ భవన్ విభజన పూర్తి : తెలంగాణకు 8, ఏపీకి 11 ఎకరాలు

ఏపీ భవన్ విభజన పూర్తి : తెలంగాణకు 8, ఏపీకి 11 ఎకరాలు

ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పంచాయతీ వీడింది. ఏపీ భవన్ విభజనపై రెండు రాష్ట్రాలు అంగీకర ముద్రను వేశాయి. ఏపీ భవన్ విభజన పై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపడంతో లైన్ క్లియర్ అయ్యింది. దీంతో కేంద్ర హోం శాఖ అధికారంగా ఉత్తరువులు జారీ చేసింది. ఏపీ భవన్ లో

తెలంగాణకు 8 ఎకరాల 24 గుంటలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు శబరి బ్లాక్ 3 ఎకరాలు, పటౌడి హౌజ్ 5 ఎకరాల 24 గుంటలు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఇక ఏపీ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ కు మొత్తం 11 ఎకరాల 53 గుంటల భూమిని కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 5 ఎకరాల 78 గుంటల గోదావరి, స్వర్ణముఖి బ్లాక్ లు కేటాయించింది.  నర్సింగ్ హాస్టల్ లో 3 ఎకరాల 35 గుంటలు, పటౌడి హౌజ్ లో 2 ఎకరాల 39 గుంటల భూమిని కేటాయించింది. ఈ మొత్తం ప్రతిపాధనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆంగీకారం తెలిపాయి.