తెలుగు రాష్ట్రాల్లో ధూంధాంగా.. దీపావళి సెలబ్రేషన్స్

తెలుగు రాష్ట్రాల్లో ధూంధాంగా.. దీపావళి సెలబ్రేషన్స్

రెండు తెలుగు రాష్ట్రంలో దీపావళి ఘనంగా జరుపుకున్నారు ప్రజలు. పండుగ రోజు ఉదయం ఆలయాలకు పోటెత్తారు జనం.  క్రాకర్స్ షాపులన్ని కొనుగోలు దారులతో సందడిగా మారాయి. ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పటాకుల షాపులు ఇళ్లకు దూరంగా స్కూల్ గ్రౌండ్స్, ఓపెన్ ప్లేస్ లలో ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. రేట్లు ఎక్కువగా ఉన్నా పటాసుల అమ్మకాలు భారీగానే జరిగాయి. కొందరు పొల్యూషన్ లేని టపాసులు  కొనేందుకు ఆసక్తి చూపించారు.

ఇక సాయంత్రం దీపాలతో ఇళ్లు అలంకరించారు మహిళలు. పువ్వుల అలకంరణ, దీపాల వెలుగులతో ఊళ్లన్నీ కళకళలాడాయి. చిన్నాపెద్దా అంతా హుషారుగా పటాకులు కాలుస్తూ సంబురంలో మునిగిపోయారు. ధూంధాంగా గంటల కొద్దీ పటాకులు పేలుస్తూ దివ్వెల పండుగను ఎంజాయ్ చేశారు. మహిళలు సాయంత్రం వేళ కూడా ఆలయాలకు వెళ్లి దీపాల వరుసలు పేర్చారు. దివ్వెల వెలుగులతో దేవాలయాలు సుందరంగా వెలిగిపోయాయి.