టపాసులు కాల్చుతూ గాయపడ్డ చిన్నారులు

టపాసులు కాల్చుతూ గాయపడ్డ చిన్నారులు

దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాలుస్తుండగా పలువురు గాయపడ్డారు. కళ్లకు గాయాలు అయిన వాళ్ళు.. సరోజిని దేవి కంటి హాస్పిటల్ కు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 36 మంది బాధితులు హాస్పిటల్ కు వచ్చారు. ఇందులో 5 మంది అడ్మిట్ అయ్యారని తెలిపారు డాక్టర్లు. వీరిలో ముగ్గురు పెద్దవాళ్ళు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని చెప్పారు. ఇందులో ఇద్దరికి అవసరం పడటంతో సర్జరీ చేసినట్లు తెలిపారు.