బుధవారానికి అసెంబ్లీ వాయిదా

బుధవారానికి అసెంబ్లీ వాయిదా

బడ్జెట్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంత్రి హరీష్ రావు శాసనసభలో, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ పరిశీలన కోసం మంగళవారం అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటలకు తిరిగి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. 8వ తేదీ నుంచి పద్దులపై చర్చ జరగనుంది. 12వ తేదీన ద్రవ్య వినిమ‌య బిల్లును ఆమోదించ‌నున్నారు. అనంత‌రం స‌మావేశాలు వాయిదా ప‌డనున్నాయి.