
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కోల్పోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ విమర్శి్ంచారు. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోందన్నారు. నాంపల్లిలోని బీజేపీ పార్టీ ఆఫీసులో ఆమె మాట్లాడారు. అధికారంలో ఉన్న కర్ణాటకలో రూ. 4 వేల ఫించన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారా అని డీకే అరుణ ప్రశ్ని్ంచారు. కర్ణాటకలో ఆర్టీసీ పరిస్థితి అధ్వానంగా తయారైందన్న ఆమె.. అక్కడ ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు.. పార్టీ మారరని, కుంభకోణాలు చేయబోమని, తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించబోమని గ్యారంటీ ఇవ్వాలని అరుణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ముందు ఈ మూడు గ్యారంటీలు ఇవ్వాలన్నారు.
బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు డీకే అరుణ. మహిళలను గౌరవించే అలవాటు కేసీఆర్‌కు లేదన్నారు. బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక కమిటీల్లో మహిళలు ఉన్నారా అని ప్రశ్ని్ంచారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులో తన శ్రమ కూడా ఉందన్న ఆరుణ.. ఆ ప్రాజెక్టు కోసం కృషి చేసిన నన్ను గౌరవించకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.