కేసీఆర్ కు బుద్ధి చెప్పి.. గద్దె దింపాల్సిన సమయమొచ్చింది

కేసీఆర్ కు బుద్ధి చెప్పి.. గద్దె దింపాల్సిన సమయమొచ్చింది

జీవో నెంబర్ 317కు వ్యతిరేకంగా మహబూబ్ నగర్‎లో నిరసన సభను ఏర్పాటుచేశారు. నియంత కేసీఆర్ చేష్టలను ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలదేనని జాతీయ ఉఫాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే సకల జనుల సమ్మెలో అందరూ పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకుంటే.. ఆ ఫలాలను మాత్రం కేసీఆర్ కుటుంబమే తింటోందని ఆమే మండిపడ్డారు. 

‘కేసీఆర్ తీరు వల్లే జీవో 317కు వ్యతిరేకంగా నిరసన తెలపాల్సి వస్తోంది. ప్రశ్నించే వారిని భయపెట్టాలని చూస్తున్నారు. అలాంటి కేసీఆర్‎కు బుద్ధి చెప్పాల్సిన సమయం, ఆయనను గద్దె దింపాల్సిన సమయం వచ్చింది.  ఈ జీవో వల్ల ఇప్పటికే 9 మంది టీచర్లు చనిపోయారు. అయినా కేసీఆర్‎లో మాత్రం ఎటువంటి చలనం రాలేదు. టీచర్లకు బీజేపీ అండగా ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వచ్చేది ఖాయం.. జీవో 317ను సవరించేది ఖాయం. ఇంకొంత కాలం ఈ కష్టాన్ని భరించండి. ఈ నియంత ప్రజల మనిషి కాదు. కుటుంబం కోసమే రాజ్యమేలుతున్నడు తప్ప ప్రజల కోసం కాదు. 317 జీవోను సవరించేదాకా మా పోరాటం సాగుతుంది. కాళేశ్వరంతో తెలంగాణలోని నలుమూలలకు నీళ్లు ఇస్తానన్నారు. పాలమూరులోకి కాళేశ్వరం నీళ్లు వచ్చాయా? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‎లో అవినీతి చేయలేదని యాదాద్రి ఓపెనింగ్‎లో నరసింహ స్వామి మీద ఒట్టేయగలడా?’ అని అరుణ ప్రశ్నించారు.

For More News..

మేడారానికి స్పెషల్ బస్సులు.. ధర ఎంతంటే? 

ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు వాయిదా