ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు వాయిదా

ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు వాయిదా

అమరావతి : కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ కట్టడికి ఆంక్షలు కఠినం చేశాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సర్కారు సైతం నిన్నటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పింది. తాజాగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్వర్వులను సవరించి కొత్త జీవో జారీ చేసింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశమున్నందున దాని అమలును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సంక్రాంతి అనంతరం ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు చెప్పింది.

మరిన్ని వార్తల కోసం..

యూపీలో బీజేపీకి ఝలక్ ఇచ్చిన మినిస్టర్

అసెంబ్లీ ఎన్నికలకు మాయావతి దూరం