అసెంబ్లీ ఎన్నికలకు మాయావతి దూరం

అసెంబ్లీ ఎన్నికలకు మాయావతి దూరం

లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటిచడంతో రాజకీయపార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. రాజకీయపక్షాలన్నీ అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యాయి. ఇదిలా ఉంటే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్, మాజీ సీఎం మాయావతి పోటీ చేయరని ఆ పార్టీ సతీష్ చంద్ర మిశ్రా ప్రకటించారు. ఎన్నికల సంసిద్ధతకు సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన.. మాయావతి గతంలో ఎన్నడూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారని చెప్పారు. బెహన్ జీతో పాటు తాను కూడా బరిలో నిలవడం లేదని చెప్పారు. యూపీలో మెజార్టీ సీట్లు గెలుస్తామన్న అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన మిశ్రా.. సమాజ్వాదీ పార్టీకి 400 మంది అభ్యర్థులే లేనప్పుడు ఆ పార్టీ 400 సీట్లు ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో ఎస్పీ, బీజేపీలు అధికారంలోకి వచ్చే ప్రసక్తేలేదన్న ఆయన.. రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే మాయావతి 66వ పుట్టిన రోజైన జనవరి 15న బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ క్యాండిడేట్ల లిస్టును బెహన్ జీ ఫైనల్ చేసినట్లు సమాచారం. మరోవైపు కోవిడ్ కేసులు పెరుగడం, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున పార్టీ కార్యకర్తలు తమ ఇళ్లల్లోనే తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని మాయావతి కోరారు. యూపీలో 7దశల్లో పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 10న మొదలై మార్చి 7న ముగియనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. 

For more news..

ప్రికాషనరీ డోసు వ్యాక్సినేషన్ వేసుకున్న నఖ్వీ, స్టాలిన్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్నం