పండిత్ దీన్ దయాళ్​ ఆదర్శప్రాయుడు

 పండిత్  దీన్ దయాళ్​ ఆదర్శప్రాయుడు

పాలమూరు, వెలుగు: దేశ సమగ్రాభివృద్ధికి పండిత్  దీన్  దయాళ్​ బాటలు వేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ ఆఫీస్​లో పండిత్  దీన్  దయాళ్​ ఉపాధ్యాయ 56వ బలిదాన్  దివస్  సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అట్టడుగు వ్యక్తికి చేరాలని కోరుకున్న పేదల పక్షపాతి అని కొనియాడారు. 

పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, పడాకుల బాలరాజ్, అసెంబ్లీ కన్వీనర్  అంజయ్య, కృష్ణవర్ధన్ రెడ్డి, పడాకుల సత్యం, బుడ్డన్న, పాండురంగారెడ్డి పాల్గొన్నారు.