అమెరికా అధ్యక్షుడు కూడా.. మా స్కీంలను కాపీ కొడుతున్నడు..కర్నాటక సీఎం డీకే శివకుమార్

అమెరికా అధ్యక్షుడు కూడా.. మా స్కీంలను కాపీ కొడుతున్నడు..కర్నాటక సీఎం డీకే శివకుమార్

బెంగళూరు: కర్నాటకలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. తమ గ్యారెంటీ పథకాలు ప్రజల్లో విశేషమైన ఆదరణ పొందాయని చెప్పారు. ఎంతగా అంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తమ పథకాలను కాపీ కొడుతున్నారని చెప్పారు. సోమవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. 

తమ ప్రభుత్వ పథకాలను చూసి ట్రంప్ కూడా స్ఫూర్తి పొందుతున్నారని వివరించారు. అందుకే, అమెరికాలో రిపబ్లికన్ పార్టీ గెలిచి పార్లమెంట్‌‌పై పూర్తి పట్టు సాధిస్తే.. దేశంలోని ప్రతి వయోజనుడికి 5 వేల డాలర్లు (రూ. 4.7 లక్షలు) ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అమెరికాలోకి ట్రిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం వచ్చి చేరుతోందని, ఆ నిధులను ప్రజలందరికీ పంచుతామని ట్రంప్ చెప్పినట్లు గుర్తుచేశారు. కర్నాటకలో తాము ఇస్తున్న సంక్షేమ హామీలే ఇప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్య నాయకుల్లో కూడా ఆలోచన రేకెత్తిస్తున్నాయని డీకే పేర్కొన్నారు.